జంపన్నవాగులో మునిగి కామారెడ్డి వాసి మృతి

ములుగు జిల్లాలోని మేడారం జాతరకు వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన కురుమ సాయిలు(35) మృతిచెందాడు.

Published : 23 Feb 2024 05:18 IST

మేడారం(శివనగర్‌), న్యూస్‌టుడే: ములుగు జిల్లాలోని మేడారం జాతరకు వెళ్లిన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన కురుమ సాయిలు(35) మృతిచెందాడు. గురువారం జంపన్నవాగులో స్నానానికి వెళ్లిన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 108 అంబులెన్సు సిబ్బంది అతన్ని మేడారం ఆసుపత్రికి తీసుకెళ్లగా అత్యవసర వైద్య బృందం సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయిందని ములుగు డీఎంహెచ్‌వో డా.అప్పయ్య తెలిపారు. సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న సాయిలుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని