గుజరాత్‌లో రూ.350 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

ఓ చేపల పడవ నుంచి 50 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 24 Feb 2024 04:30 IST

వెరావల్‌: ఓ చేపల పడవ నుంచి 50 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయ విపణిలో దీని విలువ రూ.350 కోట్ల వరకు ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు.

భారత్‌-నేపాల్‌ సరిహద్దులో ..

మహారాజ్‌గంజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని భారత్‌-నేపాల్‌ సరిహద్దు ప్రాంతమైన సోనౌలిలో రెండు వేర్వేరు ఘటనల్లో 110 కిలోల మాదకద్రవ్యాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు ప్రాంతంలో చేసే సాధారణ తనిఖీల్లో నలుగురు వ్యక్తుల దగ్గర 71 కిలోలు, అదే ప్రాంతంలో ముగ్గురు మహిళల వద్ద 39 కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని