విదేశాల్లో ‘గొర్రెల’ గోల్‌మాల్‌ నిందితులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘గొర్రెల’ గోల్‌మాల్‌ ప్రధాన నిందితులు విదేశాలకు పారిపోయారు. ఈ పథకం పేరిట సుమారు రూ.2.01కోట్లు కొట్టేసిన వ్యవహారంలో గుత్తేదారులైన మొయినుద్దీన్‌, అతడి కుమారుడు ఇక్రమ్‌ చాలా రోజుల క్రితమే దేశం విడిచి పారిపోయినట్లు అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) తాజాగా గుర్తించింది.

Published : 24 Feb 2024 06:42 IST

లుక్‌ అవుట్‌ నోటీసు జారీకి ఏసీబీ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘గొర్రెల’ గోల్‌మాల్‌ ప్రధాన నిందితులు విదేశాలకు పారిపోయారు. ఈ పథకం పేరిట సుమారు రూ.2.01కోట్లు కొట్టేసిన వ్యవహారంలో గుత్తేదారులైన మొయినుద్దీన్‌, అతడి కుమారుడు ఇక్రమ్‌ చాలా రోజుల క్రితమే దేశం విడిచి పారిపోయినట్లు అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) తాజాగా గుర్తించింది. వీరిద్దరు దుబాయ్‌లో తలదాచుకుని ఉంటారని భావిస్తున్నారు. వారిపై లుక్‌ అవుట్‌ నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. ఈకేసులో గురువారం నలుగురు ప్రభుత్వ అధికారులను అనిశా అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. గొర్రెల సరఫరాదారులకు అందాల్సిన మొత్తాన్ని గుత్తేదారుల ఖాతాల్లోకి మళ్లించడంలో సహకరించినట్లు తేలడంతో ఆ నలుగురిని కటకటాల్లోకి పంపించారు. ఈ మోసంపై తొలుత గచ్చిబౌలి ఠాణాలో గత డిసెంబరులో కేసు నమోదైంది. విషయ తీవ్రత దృష్టా ప్రభుత్వం కేసును ఏసీబీకి బదిలీ చేసింది. గచ్చిబౌలిలో కేసు నమోదు చేసిన తర్వాతే నిందితులు విదేశాలకు పారిపోయినట్లు తాజాగా వెల్లడైంది. అక్కడి నుంచే వారు ఈ కేసులోని సాక్షులను ఫోన్లలో బెదిరిస్తున్నట్లు కూడా తేలింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని