ఏపీలో.. నల్గొండ జిల్లా ఎస్‌ఐపై దాడి

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ సతీష్‌తోపాటు వారి సిబ్బందిపై వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు పురపాలికలోని చిన్నయ్యగారిపల్లెలో గురువారం రాత్రి దాడి జరిగింది.

Updated : 24 Feb 2024 06:46 IST

పోలీసు వాహనం ధ్వంసం
వైయస్‌ఆర్‌ జిల్లాలో ఘటన

మైదుకూరు, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ సతీష్‌తోపాటు వారి సిబ్బందిపై వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు పురపాలికలోని చిన్నయ్యగారిపల్లెలో గురువారం రాత్రి దాడి జరిగింది. పోలీసు వాహనంపైనా దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మైదుకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నయ్యగారిపల్లెకు చెందిన ఓబుగాని శివతోపాటు మరికొందరు నల్గొండ జిల్లా చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గొర్రెలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో రూ.30 లక్షల మేర అప్పు పెట్టారు. ఆ డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు పదిరోజుల కిందట చెన్నంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

సమన్లు జారీ చేసేందుకు బాధితులతో కలిసి ఎస్‌ఐ సతీష్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చిన్నయ్యగారిపల్లె చేరుకున్నారు. అక్కడ గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో చిన్నయ్యగారిపల్లెకు చెందిన శివతోపాటు మరో పది మంది.. ఎస్‌ఐ, ఇతర సిబ్బంది, వాహన డ్రైవరు తదితరులపై దాడి చేసి గాయపరిచారు. వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు మైదుకూరు ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని