విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి

వ్యవసాయ మోటార్లు మరమ్మతులు చేయడానికి వెళ్లిన ఇద్దరు అన్నదాతలు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Updated : 24 Feb 2024 04:51 IST

చిన్నచింతకుంట, న్యూస్‌టుడే: వ్యవసాయ మోటార్లు మరమ్మతులు చేయడానికి వెళ్లిన ఇద్దరు అన్నదాతలు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. పర్ధిపూర్‌కు చెందిన కొందరు రైతులు గ్రామ శివారులోని జలాశయంలోని నీటిని మోటార్ల ద్వారా తోడుకుని వరి సాగు చేస్తున్నారు. కుర్వ పూజారి మల్లప్ప(55), గాజా మోహన్‌రెడ్డి(57) ఉదయం జలాశయం వద్దకు వెళ్లారు. వేసవి నేపథ్యంలో మోటార్లకు నీరు అందకపోవడంతో వాటిని నీటిలోకి తీసుకెళ్లి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. పొలం పనులకు వెళ్తున్న వ్యవసాయ కూలీలు నీటిలో విగతజీవులుగా పడి ఉన్న రైతులను చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. మల్లప్ప రెండెకరాల్లో, మోహన్‌రెడ్డి మూడెకరాల్లో వరి సాగు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని