కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన ఎర్రచంద్రనం స్మగ్లర్లు

ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో ఓ కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని చింతలపాలెం అటవీ తనిఖీ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది.

Published : 24 Feb 2024 04:38 IST

జీవకోన (తిరుపతి), న్యూస్‌టుడే: ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో ఓ కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని చింతలపాలెం అటవీ తనిఖీ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌రావు, ఎఫ్‌బీవో హేమావతి, వాచర్‌ కె.సుబ్రహ్మణ్యం ఏర్పేడు వైపు వస్తున్న కారును తనిఖీ కోసం ఆపేందుకు యత్నించారు. దీంతో అందులోనివారు ప్రభాకర్‌రావును కారుతో ఢీకొట్టి పరారయ్యారు. గాయపడిన కానిస్టేబుల్‌ను సహచరులు ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని