అమ్మమ్మకు పాముతో కాటు వేయించి హత్య

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఓ యువకుడు తన అమ్మమ్మకు బీమా చేయించి, తర్వాత పాము కాటు వేయించి చంపేశాడు.

Published : 25 Feb 2024 04:25 IST

రూ.కోటి బీమా సొమ్ము కోసం మనవడి దారుణం

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఓ యువకుడు తన అమ్మమ్మకు బీమా చేయించి, తర్వాత పాము కాటు వేయించి చంపేశాడు. బాందే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాణి పఠారియా అనే మహిళ పేరిట ఆమె మనవడు ఆకాశ్‌ రూ.కోటి బీమా పాలసీ చేయించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ వ్యక్తికి రూ.30వేలు సుపారీ ఇచ్చి.. వృద్ధురాలికి పాము కాటు వేయించాడు. అనంతరం ఆమె చనిపోయింది. పాము కాటు కారణంగానే మరణం సంభవించిందని నిందితుడు అందరినీ నమ్మించాడు. రూ.కోటి బీమా సొమ్ము అందుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు ఆకాశ్‌ ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో అతణ్ని పదేపదే ప్రశ్నించగా అసలు సంగతి బయటపడింది. దీంతో ఆకాశ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతని దగ్గర నుంచి రూ.10 లక్షల నగదు, రాణి పఠారియా నగలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని