నల్లమలలో వేటగాళ్ల అరెస్టు

వన్యప్రాణుల ఉనికి తెలుసుకునేందుకు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు వేటగాళ్లను పట్టించాయి. దీంతో అటవీ అధికారులు ముగ్గురిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.

Updated : 25 Feb 2024 05:54 IST

పదర (అమ్రాబాద్‌), న్యూస్‌టుడే: వన్యప్రాణుల ఉనికి తెలుసుకునేందుకు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు వేటగాళ్లను పట్టించాయి. దీంతో అటవీ అధికారులు ముగ్గురిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు రేంజ్‌ అధికారి ఆదిత్య కథనం ప్రకారం.. మద్దిమడుగు రేంజ్‌లోని పందిగుండం సెక్షన్‌ ఉమ్మన్‌పెంట పడమర బీట్‌లో జనవరిలో అక్కడక్కడా 4 నిఘా కెమెరాలు అమర్చారు. వాటిని నిక్షిప్తమైన దృశ్యాలను అధికారులు ఈ నెల 23న పరిశీలించారు. 2వ తేదీన కొందరు మనుబోతును వేటాడి తీసుకెళ్తున్నట్లు కనిపించాయి. వారిని అటవీ శాఖలో పేపర్‌పిక్కర్‌, ఎనిమల్‌ ట్రాకర్‌గా తాత్కాలిక పద్ధతిన ఉద్యోగులుగా పనిచేస్తున్న మద్దిమడుగుకు చెందిన దాసరి లాలు, దాసరి శ్రీను, మద్దిమడుగుకే చెందిన కృష్ణ, కాశమోని రామంజిగా గుర్తించారు. వీరిలో రామంజి పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని బెయిలుపై విడుదల చేసినట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని