తెదేపా సామాజిక మీడియా సభ్యుడికి రిమాండ్‌

తెదేపా సామాజిక మాధ్యమ మీడియా సభ్యుడు ఉన్నం వినీష్‌ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Published : 28 Feb 2024 05:16 IST

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తెదేపా సామాజిక మాధ్యమ మీడియా సభ్యుడు ఉన్నం వినీష్‌ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. గూడూరుకు చెందిన వినీష్‌ తన బంధువర్గమున్న తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలో నివసిస్తూ శ్రీకాళహస్తిలోని ఆలయ ఆడిట్‌ విభాగంలో పొరుగు సేవకుడిగా సేవలందిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక శ్రీకాళహస్తిలోని నర్సింగ్‌ కళాశాల నిర్వహణపై వచ్చిన విమర్శల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న నెపంతో తొట్టంబేడు పోలీసుస్టేషన్‌లో న్యూసెన్స్‌ కేసు, రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ కేసులపై వినీష్‌ అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలపై తెదేపా సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై నమోదైన పాత కేసులకు సంబంధించి రెండో పట్టణ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. తొట్టంబేడులోని న్యూసెన్స్‌ కేసునూ చేర్చి వినీష్‌ను తిరుపతి సబ్‌జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని