పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు.

Published : 28 Feb 2024 04:56 IST

యూపీలో నలుగురు పాఠశాల విద్యార్థుల మృతి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు యూపీ బోర్డు పరీక్షలు రాసేందుకు మంగళవారం జైతీపుర్‌లోని ఓ పాఠశాలకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే జరవావ్‌ గ్రామంలో కారు అదుపుతప్పింది. చెట్టును ఢీ కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. క్షతగాత్రుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని