భర్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య.. నవదంపతుల విషాదాంతం

సరదాగా విహారానికి వెళ్లిన ఓ కొత్తజంట మృత్యువు తమను వెంటాడుతోందని తెలుసుకోలేకపోయింది. దిల్లీలోని గాజియాబాద్‌కు చెందిన అభిషేక్‌ అహ్లూవాలియా (25)కు అంజలి అనే యువతితో మూడు నెలల కిందటే వివాహమైంది.

Updated : 28 Feb 2024 07:04 IST

దిల్లీ: సరదాగా విహారానికి వెళ్లిన ఓ కొత్తజంట మృత్యువు తమను వెంటాడుతోందని తెలుసుకోలేకపోయింది. దిల్లీలోని గాజియాబాద్‌కు చెందిన అభిషేక్‌ అహ్లూవాలియా (25)కు అంజలి అనే యువతితో మూడు నెలల కిందటే వివాహమైంది. వైశాలిలోని ఓ అపార్ట్‌మెంటులో వీరు ఉంటున్నారు. సోమవారం ఇద్దరూ దిల్లీ జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. అక్కడ అభిషేక్‌కు ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితులు గురుతేజ్‌ బహదూర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అభిషేక్‌ మృతిచెందాడు. ఇంటికి తీసుకొచ్చిన భర్త మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన అంజలి ఏడో అంతస్తులోని బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రగాయాలపాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. నవదంపతులు ఇద్దరూ ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని