గర్భిణిని దారుణంగా హతమార్చి 20 ముక్కలు చేసిన దుండగులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్‌రోహ్‌లో జరిగిన అమానవీయ ఘటన ఇది. గర్భిణిని దారుణంగా హత్యచేసిన గుర్తుతెలియని దుండగులు ఆమె మృతదేహాన్ని 20 ముక్కలుగా చేసి రెండు సంచుల్లో పెట్టి బైపాస్‌ రోడ్డు పక్కన పొదల్లో పడేశారు.

Published : 28 Feb 2024 04:59 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్‌రోహ్‌లో జరిగిన అమానవీయ ఘటన ఇది. గర్భిణిని దారుణంగా హత్యచేసిన గుర్తుతెలియని దుండగులు ఆమె మృతదేహాన్ని 20 ముక్కలుగా చేసి రెండు సంచుల్లో పెట్టి బైపాస్‌ రోడ్డు పక్కన పొదల్లో పడేశారు. ఖేతాపుర్‌ ధనౌరా బైపాస్‌ సమీపంలో స్థానికులకు రోడ్డు పక్కన రెండు సంచులు కనిపించాయి. అనుమానం వచ్చి చూడగా యువతి శరీరభాగాలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంచులను పరిశీలించగా మృతురాలు గర్భవతి అని తేలింది. ఆమె వివరాలు తెలియరాలేదు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ అంజలి కటారియా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని