ఐరన్‌ ఓర్‌ గనిలో ఘోర ప్రమాదం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని ఇనుప ఖనిజం గనిలో ఘోర ప్రమాదం జరగడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందడంతో పాటు మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

Published : 28 Feb 2024 05:15 IST

ఐదుగురు కార్మికుల దుర్మరణం
శిథిలాల కింద మరికొందరు..

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని ఇనుప ఖనిజం గనిలో ఘోర ప్రమాదం జరగడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందడంతో పాటు మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దంతెవాడ జిల్లా కిరండోల్‌ ప్రాంతంలోని ఎన్‌ఎండీ…సీ ఐరన్‌ఓర్‌ మైన్స్‌లో ఎల్‌ అండ్‌ టీ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. మైన్స్‌లో స్క్రీనింగ్‌ ప్లాంట్‌కు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడ పనులు చేస్తున్న దాదాపు 15 మంది కార్మికులపై ఒక్కసారిగా గనిలో బండరాళ్లు కూలి పడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. అధికార యంత్రాంగం యంత్రాల సహాయంతో వీరి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసింది. మరో 8 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసు అధికారులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సంఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలానికి దంతెవాడ అదనపు ఎస్పీ ఆర్కే బర్మన్‌ చేరుకొని ప్రమాద పరిస్థితిని సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని