ఆన్‌లైన్‌ గేమ్‌ నిర్వాహకుల వేధింపులు.. గుడిమల్కాపూర్‌లో బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో ఓడిన యువకుడు బాకీ తీర్చలేక నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది.

Updated : 28 Feb 2024 06:20 IST

కార్వాన్‌, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ గేమ్‌ల్లో ఓడిన యువకుడు బాకీ తీర్చలేక నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ బైరి రాజు, ఎస్సై రాజేందర్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాకు చెందిన శీలం మనోజ్‌(20) కుటుంబ సభ్యులతో కలిసి గుడిమల్కాపూర్‌లోని హీరానగర్‌లో నివసిస్తున్నాడు. దుండిగల్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడిన అతడు ఓడిపోయి భారీగా నష్టపోయాడు. ఆ బాకీ చెల్లించడం లేదని గేమ్‌ నిర్వాహకులు చేస్తున్న ఫోన్లతో మనోజ్‌ విసిగిపోయాడు. దీనికితోడు ఈ విషయం బంధుమిత్రులకు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో రూ.3లక్షల అప్పు తీర్చామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని