మోసం కేసులో వరంగల్‌ వాసి భూమిని జప్తు చేసిన ఈడీ

సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి నిధులు కొల్లగొట్టిన కేసులో నిందితుడైన కేసరి సతీశ్‌ అనే వ్యక్తికి చెందిన రూ.3.26 లక్షల విలువైన భూమిని జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 29 Feb 2024 03:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి నిధులు కొల్లగొట్టిన కేసులో నిందితుడైన కేసరి సతీశ్‌ అనే వ్యక్తికి చెందిన రూ.3.26 లక్షల విలువైన భూమిని జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వరంగల్‌ జిల్లా కొడకండ్ల సబ్‌ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసిన సతీశ్‌ ప్రజలు జమచేసిన డబ్బును కొల్లగొట్టాడు. పోస్టాఫీసులోని ఖాతాల్లో ఉన్న డబ్బును బ్యాంకులో ఉన్న తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ విషయం బయటకు రాకుండా సాప్ట్‌వేర్‌లో మార్పులు చేశాడు. ఇలా మొత్తం రూ.1.72 కోట్లు కొల్లగొట్టాడు. ఇలా వచ్చిన డబ్బుతో జూదం ఆడటంతో పాటు తెలిసిన వారికి అప్పులు ఇచ్చాడు. చివరకు విషయం బయటపడటంతో పోస్టల్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ మరో కేసు నమోదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని