అనిశా కస్టడీకి ‘గొర్రెల గోల్‌మాల్‌’ నిందితులు

గొర్రెల పంపిణీ పథకం నిధుల్ని పక్కదారి పట్టించిన కేసులో నిందితులైన నలుగురు అధికారుల్ని అవినీతి నిరోధక శాఖ(అనిశా) కస్టడీకి అప్పగించేందుకు అనిశా కేసుల ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

Published : 29 Feb 2024 03:47 IST

మూడు రోజులపాటు జరగనున్న విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకం నిధుల్ని పక్కదారి పట్టించిన కేసులో నిందితులైన నలుగురు అధికారుల్ని అవినీతి నిరోధక శాఖ(అనిశా) కస్టడీకి అప్పగించేందుకు అనిశా కేసుల ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. అయిదు రోజుల కస్టడీ ఇవ్వాలని అనిశా గత వారమే పిటిషన్‌ దాఖలు చేయగా మూడు రోజుల కస్టడీకి అనుమతి లభించింది. ఈ క్రమంలో గురువారం(నేటి) నుంచి శనివారం వరకు అనిశా ఆ నలుగురు నిందితులను తమ కస్టడీలో విచారించనుంది. సుమారు రూ.2.01కోట్ల నిధుల్ని కాజేసిన మొహిదుద్దీన్‌ ముఠాకు ఈ నలుగురు అధికారులు సహకరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కామారెడ్డి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డా.రవి, మేడ్చల్‌ జిల్లా పశువైద్యశాఖ సహాయ సంచాలకుడు డా.ఎం.ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలశాఖ అధికారి పసుల రఘుపతిరెడ్డి, వయోజన విద్యాశాఖ ఉపసంచాలకుడు సంగు గణేష్‌ను అనిశా ఇప్పటికే అరెస్టు చేసింది. మొహదుద్దీన్‌ ముఠాకు వీరు ఏ పరిస్థితుల్లో సహకరించారు అనే అంశంపై అనిశా ఈ నలుగురిని విచారించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని