ఏపీలో రహదారి గుంతలకు పోలీసు బలి

రాష్ట్రంలో రహదారి గుంతలు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని శ్రీకాకుళం-పాలకొండ ప్రధాన రహదారిలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ మృతి చెందారు.

Updated : 02 Mar 2024 10:52 IST

బూర్జ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రహదారి గుంతలు మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని శ్రీకాకుళం-పాలకొండ ప్రధాన రహదారిలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ మృతి చెందారు. కానిస్టేబుల్‌ కొత్తూరు సురేష్‌(39) శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బూర్జ నుంచి కొల్లివలస వైపు వెళ్తున్నారు. నీలాదేవిపురం కూడలి సమీపంలోకి రాగానే  రహదారిపైనున్న గుంతలను తప్పించబోయి కిందపడ్డారు. ఈ క్రమంలో సురేష్‌ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. సురేష్‌ది విజయనగరం జిల్లా రామ్‌నగర్‌. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో అస్తవ్యస్తమైన రోడ్ల వల్ల ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలతో వాహనదారుల ప్రాణాలు పోతున్నాయి. ఈ మార్గంలోని గుంతల వల్ల తరచూ వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని