ఓక్రా, ఫైజల్‌ కస్టడీకి అనుమతి

పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్‌ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.

Published : 28 Mar 2024 03:14 IST

ఈనాడు- హైదరాబాద్‌: పంజాగుట్ట డ్రగ్స్‌ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్‌ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. బుధవారం నుంచే కస్టడీ మొదలైంది. పోలీసులు నిందితుడిని పంజాగుట్ట ఠాణాకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇదే కేసులో మరో నిందితుడు, గోవాలోని కొల్వాలే జైలులో ఉన్న ఫైజల్‌ను గురువారం ఒక రోజు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం నిందితుడు గోవా జైల్లోనే ఉన్నాడు. కస్టడీకి తీసుకునేందుకు కొన్ని గంటల సమయమే ఉండడంతో ప్రత్యేక పోలీసు బృందం గోవాకు బయల్దేరనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని