13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

Published : 28 Mar 2024 03:15 IST

ఇద్దరి అరెస్టు.. పరారీలో మరో నిందితుడు

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మహబూబాబాద్‌లో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ మేరకు.. మరిపెడ ఎస్సై తహెర్‌బాబా బుధవారం ఉదయం పట్టణ శివారులోని వీరారం క్రాస్‌రోడ్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి పరిశీలించగా అందులో 50 ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 32 గిలెటిన్‌ స్టిక్‌లు, 20 బాక్సుల్లో పేలుడుకు ఉపయోగించే బూస్టర్లను గుర్తించారు. వాహనంలో ముగ్గురు ఉండగా ఓ వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. వీటి రవాణా జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జగదేవ్‌పేటకు చెందిన కస్తూరి సారయ్యకు చెందిన ‘వెంకటరమణ ఎంటర్‌ప్రైజెస్‌’ పేరిట జరుగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని వారికి పేలుడు పదార్థాలు విక్రయిస్తున్నారన్నారు. వెలగటూరుకు చెందిన కస్తూరి కుమార్‌, మరిపెడ మండలం దంటకుంటతండాకు చెందిన బాధావత్‌ కిశోర్‌లను అరెస్టు చేశామని, జయదేవ్‌పేటకు చెందిన కస్తూరి సారయ్య పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని