తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి

తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Published : 28 Mar 2024 03:16 IST

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యంపేట గ్రామానికి చెందిన పుట్ట ధర్మయ్య(38) పశువులను గ్రామశివారులో మేతకు తీసుకెళ్లాడు. పశువులు మేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో ధర్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మల్లాపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు