ఫోన్‌లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి

ఫోన్‌లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 28 Mar 2024 03:21 IST

చికిత్స పొందుతూ మృతి

నాగ్‌పుర్‌: ఫోన్‌లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పిప్రా గ్రామంలో సోమవారం రామారావ్‌ కక్డే అనే వ్యక్తి బిగ్గరగా ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అతడి కుమారుడు సూరజ్‌(28) నెమ్మదిగా మాట్లాడాలని సూచించాడు. ఈ విషయమై వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో రామారావ్‌ తన కుమారుడిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఈ ఘటన జరిగినప్పుడు తండ్రీకొడుకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని