చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి

తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది.

Updated : 28 Mar 2024 04:44 IST

అడ్డుకోబోయిన తల్లిపైనా దాష్టీకం..

కుప్పం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శివరామపురానికి చెందిన హరీష్‌కుమార్‌ ఈ నెల 25న కుప్పంలో జరిగిన చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నాడు. మంగళవారం రాత్రి శివరామపురం బస్టాండులో హరీష్‌కుమార్‌పై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గణేష్‌ దాడికి పాల్పడ్డాడు. హరీష్‌కుమార్‌ తల్లి ప్రమీళమ్మ అడ్డుకోబోగా.. దుర్భాషలాడుతూ ఆమెపైనా దాడికి తెగబడ్డాడు. ఆమె పళ్లు దెబ్బతిన్నాయి. బాధితులు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు హరీష్‌కుమారే తనపై దాడి చేశాడని గణేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని