ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దున కాంకర్‌ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి.

Published : 29 Mar 2024 03:14 IST

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దున కాంకర్‌ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి జిల్లా ఎస్పీ నీలోత్పల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన కసునూర్‌ దళం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓంది దళానికి చెందిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని భూమ్‌కాన్‌ గ్రామ పరిసరాల్లో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందడంతో.. ఛత్తీస్‌గఢ్‌, గడ్చిరోలి పోలీసులు బుధవారం రాత్రి సమావేశ స్థలానికి చేరుకోగా మావోయిస్టులు కాల్పులకు దిగారు. పోలీసులు కూడా ప్రతిస్పందించడంతో రాత్రి 11 గంటల వరకు వారి మధ్య కాల్పులు కొనసాగాయి. తిరిగి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభించి గంటపాటు కాల్పులు జరిపారు. అనంతరం మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు చోటు చేసుకోలేదని, ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్య పుస్తకాలు, కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని