కోటాలో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు.

Published : 29 Mar 2024 03:14 IST

కోటా: రాజస్థాన్‌లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న సౌమ్య కుర్మి అనే 19 ఏళ్ల విద్యార్థిని బుధవారం రాత్రి వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. ఆమె స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ అని పోలీసులు తెలిపారు. కోటాలో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 7కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని