గ్రూప్‌-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు

‘గ్రూప్‌-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 29 Mar 2024 03:15 IST

వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: ‘గ్రూప్‌-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ పిన్నావారి వీధికి చెందిన అతడిని విచారిస్తున్నారు. ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నార్సింగి ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడు రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని.. పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల పిల్లలకు ఉద్యోగాలిప్పిస్తామంటూ డబ్బు వసూలు చేసి మోసగించినట్లు సమాచారం. వరంగల్‌ పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి.. ఐదుగురి నుంచి సుమారు రూ.4 కోట్లు వసూలు చేసి ప్రధాన నిందితుడికి ఇచ్చానని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కొందరు పోలీసు అధికారుల నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లు అతడు చెప్పడంతో.. ఆయా అధికారులతో మాట్లాడి నిర్ధారించుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని