అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు

దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు.

Published : 29 Mar 2024 05:36 IST

దిల్లీ: దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. ఈ నెల 24న బవానా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తోతన్‌ లోహర్‌ అలియాస్‌ ఖుడి బాధితురాలిని అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక మృతదేహాన్ని నిరుపయోగంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పడేసి పశ్చిమ బెంగాల్‌కు పారిపోయాడు. పోలీసులు అతణ్ని అసనోల్‌ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని