పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం

పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Published : 29 Mar 2024 05:37 IST

పదో తరగతి విద్యార్థిపై కత్తితో దాడి
ముగ్గురు మైనర్లపై కేసు

ఠాణె: పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాణె జిల్లా భివాండీలోని ఓ పాఠశాలలో మంగళవారం పదో తరగతి పరీక్ష నిర్వహించారు. తాము చూచి రాసేందుకు వీలుగా జవాబు పత్రాన్ని చూపించాలని బాధిత విద్యార్థిని నిందితులు కోరగా, అతడు తిరస్కరించాడు. దీంతో ఆగ్రహించిన నిందితులు పరీక్ష ముగిసిన తర్వాత అతణ్ని చుట్టుముట్టి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అనంతరం కత్తితో పొడిచారు. గాయాలతో అతడు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం డిశ్ఛార్జ్‌ అయ్యాడు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని