Phone tapping case:: ‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది.

Updated : 29 Mar 2024 12:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఆదేశాలతో పనిచేసినట్లు గట్టుమల్లు చెప్పినట్లు సమాచారం. మరోవైపు రాధాకిషన్‌రావును కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. 

ఈ కేసులో ఇప్పటికే అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్‌ 2 వరకు ఐదు రోజుల పోలీసు కస్టడీకీకి తీసుకున్నారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 12న అరెస్ట్‌ చేశారని, ఇప్పటికే 14 రోజులు గడిచిన నేపథ్యంలో పోలీస్‌ కస్టడీకి ఇవ్వొద్దంటూ ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్‌ఐబీ)లో పని చేసిన వీరంతా ప్రముఖులపై నిఘా పెట్టి, రాష్ట్రంలో ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని