ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కార్మిక శాఖ అధికారికి రెండేళ్ల జైలుశిక్ష

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కార్మికశాఖ అధికారికి హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

Published : 30 Mar 2024 04:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కార్మికశాఖ అధికారికి హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ మేరకు సీబీఐ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కార్మికశాఖ కమిషనర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న థోడి రమేశ్‌పై 2006 నవంబరు 1వ తేదీన హైదరాబాద్‌ సీబీఐ విభాగం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. 2000 నుంచి 2006 సంవత్సరం మధ్య రమేశ్‌ రూ.59,41,026 ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించింది. 2009లో అభియోగం దాఖలవగా.. తాజా విచారణలో అవినీతి నిరోధక చట్టం కింద నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో పాటు రూ.27,73,033 లక్షల ఆస్తులను జప్తు చేయాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని