అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వాలంటీర్‌

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి పంచాయతీ బుడ్డపల్లెలో గ్రామ వాలంటీర్‌ తమ్మిశెట్టి నారాయణ అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తూ శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు.

Published : 30 Mar 2024 04:45 IST

తర్లుపాడు, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి పంచాయతీ బుడ్డపల్లెలో గ్రామ వాలంటీర్‌ తమ్మిశెట్టి నారాయణ అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తూ శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు. మద్యం సీసాలను దగ్గర పెట్టుకొని విక్రయిస్తుండగా, పోలీసులకు వచ్చిన సమాచారంతో వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడి నుంచి 8 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు తర్లుపాడులోని ఓ చిరు వ్యాపారి వద్ద కూడా 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. చిరు వ్యాపారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వాలంటీరు విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈవిషయమై ఎస్సై సుధాకర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా శనివారం కేసు రిజిస్టర్‌ చేస్తామంటూ చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని