ఎన్నికల నిధి ఇవ్వాలంటూ బెదిరింపులు

ఎన్నికల నిధి ఇవ్వాలంటూ తమను బెదిరించారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం గుంటూరు కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేశారు.

Published : 30 Mar 2024 04:47 IST

కేసు నమోదు చేసిన పోలీసులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎన్నికల నిధి ఇవ్వాలంటూ తమను బెదిరించారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం గుంటూరు కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు కొత్తపేటలోని మా డయాగ్నొస్టిక్‌ సెంటర్‌కు సుధీర్‌రెడ్డి, జగన్‌ అనే ఇద్దరు యువకులు గురువారం వచ్చారు. తాము రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులమని, తమ పార్టీకి నిధికి రూ.లక్ష ఇవ్వాలన్నారు. దీంతో సెంటర్‌ నిర్వాహకుడు ఆదినారాయణ తనవద్ద అంత డబ్బులు లేవని సమాధానమిచ్చారు. ఆ యువకులిద్దరూ మళ్లీ శుక్రవారం వచ్చి తమ పార్టీకి ఫండ్‌ ఇవ్వకపోతే ఇబ్బందులు పెడతామంటూ బెదిరించారని ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అన్వర్‌ బాషా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని