వైకాపా ప్రచార సామగ్రి, రెండు వాహనాల సీజ్‌

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారని కొందరు శుక్రవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 30 Mar 2024 04:48 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారని కొందరు శుక్రవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఎన్నికల అధికారి వరదరాజులు, సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీలు చేయగా.. అనుమతి లేకుండా ప్రచార సామగ్రి, రెండు వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని సీజ్‌ చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ఎ.లక్ష్మీకుమారి వెల్లడించారు. అనుమతి పత్రాలు చూపిస్తే వాహనాలను వదిలేస్తామని తెలిపారు. తనిఖీల సమయంలో అధికారులు, వైకాపా నేతల మధ్య వాద ప్రతి వాదనలు జరిగాయి. ఆ సమయంలో పొన్నూరు పురపాలక సంఘం స్టాండింగ్‌ కౌన్సెల్‌ నాగరాజు అక్కడకు చేరుకుని వైకాపా నాయకులకు మద్దతుగా మాట్లాడారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న ఆయన అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడం చర్చనీయాంశమైంది.

తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గోదాముల్లో వైకాపా నేతలు ఓటర్లకు పంచిపెట్టడానికి నిల్వ ఉంచగా పట్టుబడిన రూ.1.10 కోట్ల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని