గ్రామస్థుల దాడిలో దొంగ హతం

గ్రామస్థుల దాడిలో దొంగ హతమైన ఘటన శనివారం నిజామాబాద్‌ జిల్లా నవీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాల్దాలో చోటు చేసుకుంది.

Updated : 31 Mar 2024 05:22 IST

నిజామాబాద్‌ జిల్లా పాల్దాలో ఘటన

నవీపేట, న్యూస్‌టుడే: గ్రామస్థుల దాడిలో దొంగ హతమైన ఘటన శనివారం నిజామాబాద్‌ జిల్లా నవీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాల్దాలో చోటు చేసుకుంది. నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ సతీశ్‌ కుమార్‌ కథనం ప్రకారం.. పాల్దాలోని ఓ మూతపడిన ధాన్యం మిల్లులో చోరీ చేసేందుకు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి తండాకు చెందిన బానోత్‌ సునీల్‌(44), మరో అయిదుగురు కలిసి శనివారం మధ్యాహ్నం వచ్చారు. మిల్లులోని ఓ మోటారు పంపును వారు గేటు బయటకు తీసుకురాగా పలువురు గ్రామస్థులు గమనించి వారిని అడ్డుకున్నారు. వారు కేకలు వేయడంతో మిగతా అయిదుగురు దొంగలు పరారు కాగా సునీల్‌ మాత్రం స్థానికులకు పట్టుబడ్డాడు. ఈ క్రమంలో అందరూ కలిసి చితకబాదడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని హుటాహుటిన సునీల్‌ను నిజామాబాద్‌ దవాఖానాకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని