పచ్చి చేపను తినబోతే ప్రాణం పోయింది

గొంతులో పచ్చి చేప ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 31 Mar 2024 05:33 IST

బాలానగర్‌, న్యూస్‌టుడే: గొంతులో పచ్చి చేప ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాలానగర్‌ మండలం మేడిగడ్డ తండాకు చెందిన నీల్యానాయక్‌(45) ఇదే మండలంలోని మోతిఘణపూర్‌ గ్రామ శివారులోని చెరువులో శనివారం స్నేహితులతో కలిసి చేపలు పట్టాడు. పట్టిన వాటిలో ఒక చేపను తినగా అది గొంతులోకి పోయి ఇరుక్కుంది. సహచరులు దాన్ని తీసే లోపే ఆయన ఊపిరాడక మృతి చెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని