భీమవరంలో పట్టుబడ్డ మావోయిస్టు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఝార్ఖండ్‌కు చెందిన మావోయిస్టును పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

Published : 31 Mar 2024 04:38 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఝార్ఖండ్‌కు చెందిన మావోయిస్టును పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కొద్దిరోజులుగా తాపీ కార్మికులతో కలిసి పనిచేస్తున్న ఆ యువకుడు.. మావోయిస్టు అని తెలియడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఝార్ఖండ్‌కు చెందిన రాహుల్‌ కేసరి బృందంపై ఆ రాష్ట్రంలో గతంలో కేసు నమోదైంది. ఈ బృందంలో నలుగురు అరెస్టవగా రాహుల్‌ కేసరి తప్పించుకుని కొద్దిరోజులు హైదరాబాద్‌లో తలదాచుకున్నాడు. అక్కడ్నుంచి 15 రోజుల కిందట భీమవరం వచ్చి ఇతర రాష్ట్రాల కార్మికులతో కలిసి తాపీ పనులు చేస్తున్నాడు. సెల్‌ఫోన్‌ ఆధారంగా అతని జాడ గుర్తించిన ఝార్ఖండ్‌ అధికారులు.. శుక్రవారం రాత్రి స్థానిక మార్కెట్‌యార్డు పరిసరాల్లో పోలీసులు, ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సభ్యులు కాపుకాసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని