వైకాపా నాయకుల ట్రాక్టర్ల పట్టివేత

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల పరిధిలోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్‌లో అనుమతులు లేకుండా యంత్రాలతో చేపట్టిన తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఆదివారం కొరడా ఝళిపించారు.

Published : 01 Apr 2024 04:32 IST

ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారుల చర్యలు
4 పొక్లెయిన్లు, 7 టిప్పర్లూ సీజ్‌

అనంతసాగరం, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల పరిధిలోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్‌లో అనుమతులు లేకుండా యంత్రాలతో చేపట్టిన తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఆదివారం కొరడా ఝళిపించారు. రీచ్‌లోని 4 పొక్లెయిన్లు, 7 టిప్పర్లు, 2 ట్రాక్టర్లను సీజ్‌ చేసి సోమశిల పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇందులో రెండు ట్రాక్టర్లు వైకాపా నాయకులవి. దాంతో ట్రాక్టర్ల విడుదల కోసం అధికారులపై వారు ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యంత్రాలు, టిప్పర్లు, ట్రాక్టర్లను పోలీసుల అదుపులో ఉంచి, కలెక్టర్‌కు నివేదిక అందించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇదే సయయంలో స్థానిక తెదేపా, జనసేన నాయకులు రీచ్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. రీచ్‌ నిర్వాహకులు తమకు అనుమతులు ఉన్నాయని.. యంత్రాలు, వాహనాలను పోలీసుస్టేషన్‌కు ఎలా తరలిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని