దిగుబడిపై దిగులుతో కౌలురైతు ఆత్మహత్య

ఓ వైపు పంట దిగుబడి కలవరం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల సతమతంతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది.

Published : 02 Apr 2024 06:24 IST

శంకరపట్నం, న్యూస్‌టుడే: ఓ వైపు పంట దిగుబడి కలవరం.. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల సతమతంతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాచాపూర్‌ గ్రామానికి చెందిన గుజ్జుల మల్లారెడ్డి(57) కొన్నేళ్లుగా పదెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. పోయిన సీజన్‌లో మొగిపురుగు సోకి సరైన దిగుబడి రాలేదు. ఈసారి కూడా తెగుళ్లు తదితర కారణాలతో ఆశించిన మేర దిగుబడి వచ్చేలా కనిపించలేదు. దీనికి తోడు కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం పొలం వద్ద పురుగు మందు తాగారు. కుటుంబసభ్యులు గమనించి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని