ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా తెట్టెమడుగు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.

Published : 02 Apr 2024 06:24 IST

మావోయిస్టు మృతి

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా తెట్టెమడుగు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో డీఆర్జీ, కోబ్రా బెటాలియన్‌కు చెందిన భద్రతా బలగాలు తెట్టెమడుగు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఉదయం 6 గంటల సమయంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టు దళాలు కాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టుకు తుపాకీ తూటాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొందరు మావోయిస్టులు అటవీ ప్రాంతాల గుండా తప్పించుకు పారిపోయారు. ఘటనాస్థలంలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలను, పేలుడు పదార్థాలను, కిట్‌ బ్యాగులను, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని