రైలు నుంచి టీటీఈని తోసివేసిన టికెట్‌ లేని ప్రయాణికుడు

కేరళలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు.

Published : 03 Apr 2024 05:17 IST

త్రిశూర్‌: కేరళలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈని కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఎర్నాకుళం నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. టీటీఈ అవతలి పట్టాలపై పడ్డారని, అదే సమయంలో వచ్చిన మరో రైలు ఢీ కొనడంతో ఆయన మృతి చెందారని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పాలక్కాడ్‌ వద్ద నిందితుడిని పట్టుకున్నారు. టీటీఈ టికెట్‌ అడగడంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. మృతుడిని ఎర్నాకుళానికి చెందిన వినోద్‌గా గుర్తించారు. అతడు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోషించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని