ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 13కు చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా కోర్చోలీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 13కు చేరింది.

Published : 04 Apr 2024 05:38 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌ జిల్లా కోర్చోలీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 13కు చేరింది. మావోయిస్టు దళాలు-భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు బస్తర్‌తో పాటు కోర్చోలీ అటవీ ప్రాంతంలో బుధవారం గాలింపు కొనసాగించగా.. మరో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఎదురుకాల్పుల ఘటనలో మొత్తం 13 మంది మృతి చెందినట్లు పోలీస్‌ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు, ఎన్‌కౌంటర్లకు నిరసనగా బుధవారం బీజాపుర్‌ జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

మావోయిస్టుల డంప్‌ స్వాధీనం

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో గల డయాల్‌తుంగ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను భద్రతా బలగాలు బుధవారం స్వాధీనం చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని