టైలర్‌ దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ దర్జీ (టైలర్‌) దుకాణంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

Published : 04 Apr 2024 04:30 IST

ఊపిరాడక మహారాష్ట్రలో ఏడుగురి మృతి

ముంబయి: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఓ దర్జీ (టైలర్‌) దుకాణంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పొగ వ్యాపించింది. ఆ భవనం పై అంతస్తులో ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ముస్లింలు ఊపిరాడక మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలున్నట్లు గుర్తించారు. విద్యుత్‌ వాహనానికి పెట్టిన ఛార్జింగ్‌ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని