ఉద్యోగ ఇంటర్వ్యూ పేరిట రూ.2.5 లక్షలకు టోకరా

సైబర్‌ నేరగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూ పేరిట ఓ వ్యక్తికి రూ.2.5 లక్షలు టోకరా వేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

Published : 04 Apr 2024 04:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ నేరగాళ్లు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూ పేరిట ఓ వ్యక్తికి రూ.2.5 లక్షలు టోకరా వేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. బాధితుడు సామాజిక మాధ్యమంలో పంచుకోవడంతో ఈ విషయం బయటపడింది. పుణెకు చెందిన నవేద్‌ ఆలం ఓ ప్రొడక్ట్‌ డిజైనర్‌. ఓ కంపెనీ పేరుతో ఉన్న ఖాతా నుంచి ఆయనకు ఇటీవల సందేశం వచ్చింది. ‘మా సంస్థలో పనిచేయడానికి ఓ డిజైనర్‌ కోసం ఎదురుచూస్తున్నాం. మీ పోర్ట్‌ఫోలియో నచ్చింది’ అంటూ డిజైన్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు నవేద్‌ను అడిగారు. వాటికి సమాధానం చెప్పాక హెచ్‌ఆర్‌ రౌండ్‌ అంటూ ఓ అభ్యర్థనను పంపి.. లింక్‌ సాయంతో ఇంటర్వ్యూలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే డౌన్‌లోడ్‌ చేయాలని చూపిందని, అలాగే చేయడంతో క్షణాల్లో తన క్రిప్టో వాలెట్‌లోని 2,000 డాలర్లు (రూ.2.5 లక్షలు) మాయమయ్యాయని బాధితుడు వాపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని