రాజస్థాన్‌లో అత్యాచార బాధితురాలికి కోర్టులో అవమానం

రాజస్థాన్‌లో అత్యాచారానికి గురయిన ఓ దళిత మహిళకు ఘోర అవమానం ఎదురైంది. తనకు జరిగిన అన్యాయానికి కోర్టును ఆశ్రయించిన మహిళను దుస్తులు విప్పి గాయాలు చూపాలని మేజిస్ట్రేట్‌ కోరారు.

Published : 04 Apr 2024 04:33 IST

మేజిస్ట్రేట్‌పై కేసు

జైపుర్‌: రాజస్థాన్‌లో అత్యాచారానికి గురయిన ఓ దళిత మహిళకు ఘోర అవమానం ఎదురైంది. తనకు జరిగిన అన్యాయానికి కోర్టును ఆశ్రయించిన మహిళను దుస్తులు విప్పి గాయాలు చూపాలని మేజిస్ట్రేట్‌ కోరారు. దీనికి నిరాకరించిన మహిళ అనంతరం హిండౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మేజిస్ట్రేట్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కేసును నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలు గత నెల 19న అత్యాచారానికి గురైందని, ఈ కేసుపై 30వ తేదీన హిండౌన్‌ కోర్టులో విచారణ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని