తెదేపా ప్రచార వాహన డ్రైవర్‌పై వైకాపా దాడి

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో తెదేపా ప్రచార వాహన డ్రైవర్‌పై గురువారం వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు.

Updated : 12 Apr 2024 06:42 IST

ఏల్చూరు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో తెదేపా ప్రచార వాహన డ్రైవర్‌పై గురువారం వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ప్రచారంలో భాగంగా తెదేపా వాహనం వైకాపా వర్గీయులు అధికంగా నివసించే చెరువు వీధిలోకి వెళ్లింది. అక్కడ ప్రచారం నిర్వహించవద్దని వాహన డ్రైవర్‌ను వైకాపా వర్గీయులు నిలువరించారు. ఈ నేపథ్యంలో వారికీ వాహన డ్రైవర్‌ సునీల్‌కూ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైకాపా వర్గీయుల తోపులాటలో సునీల్‌ పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడి గాయాల పాలయ్యారు. అయినప్పటికీ ఆగకుండా రాళ్లతో అతనిపై దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గుంపును చెదరగొట్టారు. సునీల్‌ను అక్కడి నుంచి పంపించేశారు. గ్రామంలో ప్రచారం చేస్తున్న తనపై అయిదుగురు వైకాపా మద్దతుదారులు దాడి చేసి, వాహనానికి జెండాలు కట్టే ఇనుప ఊచల్ని విరిచేసి, వైకాపా జెండాను తమ వాహనానికి కట్టేందుకు ప్రయత్నించినట్లు పోలీసుస్టేషన్‌లో సునీల్‌ ఫిర్యాదు చేశారు.. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని