తల్లిదండ్రులను కలపలేక.. కుమార్తె బలవన్మరణం

తల్లిదండ్రులు విడిగా ఉండడం తట్టుకోలేని ఓ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

Updated : 12 Apr 2024 06:30 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు విడిగా ఉండడం తట్టుకోలేని ఓ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. నల్గొండ టూటౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాలు.. కుటుంబ తగాదాల కారణంగా తిప్పర్తి మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన పగిళ్ల సైదులు, అతడి భార్య సంధ్య గత రెండేళ్లుగా నల్గొండలోని సావర్కర్‌నగర్‌లో వేరువేరుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమార్తె యోగిత(22), కుమారుడు చాణక్య(20) సంతానం. యోగిత ప్రస్తుతం హైదరాబాద్‌లో పీజీ చదువుతోంది. ఇద్దరూ తల్లి పోషణలో ఉన్నారు. కొద్ది రోజులుగా తల్లిదండ్రులను కలపడానికి యోగిత పలు ప్రయత్నాలు చేసింది. కానీ.. వారు కలిసే పరిస్థితి లేదని మనోవేదన చెందిన ఆమె గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని