కలలో దేవత కోరిందంటూ నరబలి!

కలలో ఒక దేవత కనపడి నరబలి కోరిందంటూ హరియాణాలోని అంబాలాలో ఓ మహిళ.. ఒక వ్యక్తిని హత్య చేసింది. హతుడు మహేశ్‌ గుప్తా మృతదేహం.. నిందితురాలి ఇంట్లో లభ్యమైంది.

Updated : 13 Apr 2024 06:11 IST

హరియాణాలో ఓ మహిళ ఘాతుకం

అంబాలా: కలలో ఒక దేవత కనపడి నరబలి కోరిందంటూ హరియాణాలోని అంబాలాలో ఓ మహిళ.. ఒక వ్యక్తిని హత్య చేసింది. హతుడు మహేశ్‌ గుప్తా మృతదేహం.. నిందితురాలి ఇంట్లో లభ్యమైంది. ఇందులో ప్రియ అనే మహిళను ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. హతుడికి ఒక దుకాణం ఉంది. అందులో ప్రియ కొంతకాలం పనిచేసింది. నరబలిలో భాగంగానే ఈ హత్యను చేశానని విచారణలో ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు సాయం చేసిన బంధువులు హేమంత్‌, ప్రీతిలనూ అరెస్టు చేసినట్లు చెప్పారు. గడిచిన 4-5 రోజులుగా ఒక దేవత తనకు కలలో కనపడి, నరబలి కోరుతున్నట్లు ప్రియ చెప్పినట్లు వివరించారు. బుధవారం మహేశ్‌.. కొన్ని సామాన్లు అందించడానికి ప్రియ ఇంటికి వెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేదని తెలిపారు. అతడి కోసం గాలించిన కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. మహేశ్‌ ద్విచక్రవాహనం ప్రియ ఇంటి వద్ద కనిపించడంతో హతుడి బంధువులు అక్కడికి వెళ్లారు. తలుపు కొట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో.. బలవంతంగా లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో ప్రియ, ప్రీతి, హేమంత్‌లు.. అచేతన స్థితిలో ఉన్న మహేశ్‌ను నేలమీద ఈడ్చుకెళ్లడం కనిపించింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు రంగప్రవేశం చేసి, నిందితులను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు