సెల్‌ఫోన్‌ కోసం ఘర్షణ.. తండ్రిని కడతేర్చిన కుమారుడు

సెల్‌ఫోన్‌ కోసం తలెత్తిన ఘర్షణలో ఓ కుమారుడు కన్నతండ్రినే హత్య చేసిన వైనమిది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 13 Apr 2024 05:24 IST

రామకృష్ణాపూర్‌, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ కోసం తలెత్తిన ఘర్షణలో ఓ కుమారుడు కన్నతండ్రినే హత్య చేసిన వైనమిది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు నగర్‌కు చెందిన బావండ్లపెల్లి రాయమల్లు (60) సింగరేణి విశ్రాంత కార్మికుడు. అతడి రెండో భార్య కుమారుడు రాకేష్‌ (25) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా తండ్రి సెల్‌ఫోన్‌ను రాకేష్‌ ఉపయోగిస్తున్నాడు. గురువారం రాత్రి సెల్‌ఫోన్‌ తిరిగి ఇచ్చేయాలని రాకేష్‌ను తండ్రి అడగడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. రాకేష్‌ ఆవేశంలో రోకలితో తండ్రి తలపై కొట్టాడు. రాయమల్లుకు తీవ్ర రక్తస్రావం కాగా.. అంబులెన్సులో మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఘటనా స్థలానికి మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్‌ వెళ్లి వివరాలు ఆరా తీశారు. రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్యాతనపల్లి వద్ద రైల్వే గేటును సుమారు 20 నిమిషాలసేపు తీయకపోవడంతో వైద్యం అందడం ఆలస్యమై రాయమల్లు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని