షార్ట్‌ఫిల్మ్‌ షూటింగులో వాగ్వాదం.. యూట్యూబర్‌ జంట ఆత్మహత్య

వారిద్దరూ సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందిన యూట్యూబర్లు. ఓ షూటింగు సమయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చినికిచినికి గాలివానలా మారి ప్రాణాల మీదకు తెచ్చింది.

Updated : 14 Apr 2024 04:41 IST

దిల్లీ: వారిద్దరూ సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందిన యూట్యూబర్లు. ఓ షూటింగు సమయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చినికిచినికి గాలివానలా మారి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గర్విత్‌సింగ్‌ గైరీ (25), నందిని (22) జంట గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వేదికల్లో సొంతంగా ఛానల్స్‌ నిర్వహిస్తున్నారు. దేహ్రాదూన్‌లో ఉంటున్న వీరు ఇటీవల హరియాణాలోని బహాదుర్‌గఢ్‌కు వచ్చారు. అయిదుగురు బృంద సభ్యులతో కలిసి ఓ ఫ్లాటును అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇటీవల షార్ట్‌ఫిల్మ్‌ షూటింగులో పాల్గొన్న ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ కొట్లాట మరింత ముదిరి.. ఇద్దరూ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని