పెట్రోలు పోసి.. మంటల్లోకి తోసి

ఖాళీ స్థలం ఆక్రమణను అడ్డుకున్నందుకు విశాఖలో ఒంటరి మహిళపై వైకాపా నాయకుడు పెట్రోలు పోసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు.

Updated : 14 Apr 2024 05:51 IST

స్థలం ఆక్రమణను అడ్డుకున్నందుకు.. ఒంటరి మహిళపై వైకాపా నాయకుడి హత్యాయత్నం

విశాఖపట్నం (గాజువాక), న్యూస్‌టుడే: ఖాళీ స్థలం ఆక్రమణను అడ్డుకున్నందుకు విశాఖలో ఒంటరి మహిళపై వైకాపా నాయకుడు పెట్రోలు పోసి, సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు, న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌ సీఐ దాలిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. 65వ వార్డు భానోజీతోట ప్రాంతానికి చెందిన జలుమూరి రాధ(41)ను వార్డు వైకాపా అధ్యక్షుడు ఎం.లోకనాథం తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కొత్తగా ఇంటి పట్టా ఇప్పిస్తానని పలుమార్లు ఆమె దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా రాధ ఇంటి సమీపంలో ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుండటంతో.. బాధితురాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం లోకనాథం తన కుటుంబ సభ్యులతో కలిసి సంబంధిత ఖాళీ స్థలాన్ని చదును చేసి, అక్కడి వ్యర్థాలకు నిప్పుపెట్టాడు. ఆక్రమణపై మరోసారి రాధ ప్రశ్నించడంతో.. తీవ్రంగా ఆగ్రహించిన లోకనాథం ఆమెపై పెట్రోలు పోసి, మంటల్లోకి తోసేశాడు. ముఖం, చేతులపై తీవ్ర గాయాలైన బాధితురాలిని స్థానికులు కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకనాథం, ఆయన కుటుంబ సభ్యులు శ్యామలారావు, శకుంతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని