హోటల్‌ దగ్ధం.. నర్సింగ్‌ విద్యార్థిని సజీవ దహనం

అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో మంటలు ఎగిసిపడి హోటల్‌ కాలి యువతి సజీవ దహనమయ్యారు.

Updated : 17 Apr 2024 06:12 IST

అనంతపురం జిల్లాలో గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ దుర్ఘటన

కూడేరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో మంటలు ఎగిసిపడి హోటల్‌ కాలి యువతి సజీవ దహనమయ్యారు. నాగభూషణం, జ్యోతి దంపతులు కొన్నేళ్లుగా జాతీయ రహదారి పక్కన రేకుల షెడ్డులో హోటల్‌తోపాటు శీతల పానీయాల దుకాణం నిర్వహిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. మంగళవారం మధ్యాహ్నం జ్యోతి తన చిన్న కుమార్తె ప్రత్యూష (21)తో కలిసి వంట చేస్తుండగా కుక్కర్‌ పేలింది. దాని మూత సిలిండరు పైపుపై పడటంతో గ్యాస్‌ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రత్యూష కింద పడిపోవడంతో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా నిష్ఫలమైంది. ఆమె అనంతపురంలోని నర్సింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. తీవ్రగాయాలైన జ్యోతిని అనంతపురం తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని